![]() |
![]() |
.webp)
దివి వాద్య.. ఈ పేరు ఇప్పుడు అందరికి సుపరిచితమే. బిగ్ బాస్ 4 లో ఛాన్స్ కొట్టేసి మంచి ఫేమ్ సంపాదించుకున్న ఈ భామకి మంచి క్రేజ్ ఉంది.
దివికి ఇన్ స్టాగ్రామ్ లో 1.2 మిలయన్ ఫాలోవర్స్ ఉన్నారు. తాజాగా పాండిచ్చేరి వెళ్ళిన దివి తన ఇన్ స్టా అకౌంట్ లో కొన్ని ఫోటోలని షేర్ చేయగా అవి ఫుల్ వైరల్ గా మారాయి. ఇప్పుడు తాజాగా మరో వీడియోతో నెట్టింట వైరల్ గా మారింది. దివి ఇండస్ట్రీకి మొదటగా ఒక మోడల్ గా పరిచయం అయింది. ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి సినిమాలో వెండి తెర పై మెరుపు తీగలా అలా వచ్చి ఇలా వెళ్తుంది. ఆ తర్వాత బిగ్ బాస్ లో ఛాన్స్ వచ్చింది. ఆ తర్వాత ఈ అమ్మడుకి క్రేజ్ వేరే లెవెల్ లో వచ్చేసింది. ఏటీఎమ్ వెబ్ సిరీస్ లో కూడా నటించింది. లంబసింగి సినిమాలో దివి హీరోయిన్ గా చేసిన పెద్దగా గుర్తింపు రాలేదు.
దివి ఇన్ స్టాగ్రామ్ లో ఎప్పటికప్పడు హాట్ ఫోటోలతో నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. స్కిన్ షో చేస్తూ సోషల్ మీడియాలో వేడి పుట్టిస్తూ ఫాలోయింగ్ ని పెంచుకుంటోంది. తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో ఆమ్లెట్ వేస్తున్న ఓ వీడియోని షేర్ చేసింది దివి. ఆ వీడియోలో దివి మాట్లాడుతూ.. ' అందరు డిఫరెంట్ గా చేస్తారు.. కానీ నేను ఇంకా ఢిఫరెంట్ గా చేశాను. అదే అవకాయ ఆమ్లెట్. చూడండి' అంటూ తను చేసిన ఆవకాయ ఆమ్లెట్ ని చూపించింది. ఇది చూసిన నెటిజన్లు మొదటగా అందరు డిఫరెంట్ గా చేయడమేంట్రా బాబు అని ఆశ్చర్యపోతున్నారు. అసలు ఏం ఉందమ్మ ఇందులో అనుకుంటూ మరికొందరు వాపోతున్నారు. ఇక దివి తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
![]() |
![]() |